ఈరోజు నా వ్యాసం కరొన మీద .....
కరోనా పేరు వినగానే ప్రపంచం మొత్తం గడగడలాడి పోతుంది.ఈ మహమ్మారి సృష్టిస్తున్న మారణహోమం అలాంటిది.దీనినే covid-19 అని పేరుకూడా ఉంది. ఇక విషయానికి వస్తే ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది.దీనికి అనేక రూపాలు ఉన్నాయ్. ఎంతోమంది శాస్త్రవేత్తలు దీని మీద రీసెర్చ్ లు చేస్తున్నారు.తగు నివారణ చర్యలు ప్రభుత్వాలు చేపడుతున్నాయి.ఆర్థికవ్యవస్థ :
ప్రపంచ ఆర్థికవ్యవస్థ చాల దయనీయంగా మారింది.కొన్ని దేశాలు మరి దారుణస్థితికి వెళుతున్నాయి. అగ్రరాజ్యాలు సైతం ఈ మహమ్మారి బారిన పడి విలవిలా లాడుతున్నాయి. స్టాక్ మార్కెట్ కుదేలు అయిపొయింది. జీడీపీ రేటు గణనీయంగా పడిపోయింది. ఇక ఇండియా లో పరిస్థితి రోజు రోజు కి కష్టతరం అవుతోంది. కానీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవటం వలన కొంత నష్టం నుండి బయట పడుతునము. కానీ ఇంకా చర్యలు ముమ్మరం చేయాల్సివుంది.ఉపాధికోల్పోవటం :
ఈ మహమ్మారి వలన ఎంతోమంది ఉపాధి కోల్పోవటం జరుగుతూ ఉంది. కొన్ని పరిశ్రమలు మూసివేయటం జరిగింది.కొన్ని పరిశ్రమలు తట్టుకొని నడుపుతూ ఉన్నాయి. జీతాలు కూడా తగు మొత్తం లో లేని పరిస్థితి.చాల కుటుంబాలు రోడ్ పైన పడుతున్నాయి.
సంబంధాలు :
ఈ కరోనా వలన మనుషుల్లో మానవత్వం సన్నగిల్లింది. కొన్నిచోట్ల చాల మంది దాతలు చాలామందిని ఆదుకోవటం జరిగింది. చాల కంపెనీ లు ఆయా ప్రభుతవలకు విరాళాలు ఇవ్వటం జరిగింది .అలాగే చాలామంది దాతలు తమ శక్తీ కొలది విరాళాలు ఇవ్వటం జరిగింది. చిన్న పిల్లలు దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరు ఏదొక రూపేణా తమవంతు సహాయం చేసినవారే మరియు చేస్తున్నారు కూడా..
విద్య :
ఈ కరోనా వలన విద్య వ్యవస్థ బాగా దెబ్బతింది. పాఠశాలలు మూసివేయటం జరిగింది.చాల స్కూల్స్ మరియు కళాశాలలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అవి ఎంత వరకు విద్యార్థులకు దోహద పడతాయో వేచి చూడాలి.
వైద్యం :
మనం నిజంగా వైద్యులకు శిరసు వంచి నమస్కారం చేయాలి వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వృత్తి మీద వారికీ ఉన్న నిబద్ధతకు వారికీ యావత్ భారతదేశం సెల్యూట్ చేస్తోంది. కానీ మన వైద్య ప్రమాణాలు చాల మెరుగు పడాలి.ఆధునికరణలో మనం ఇంకా వెనుకబడి ఉన్నాం. వైద్య సిబ్బంది అందరికి హాట్స్ ఆఫ్.
పోలీస్ వ్యవస్థ :
ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి పోలీసు డిపార్ట్మెంట్ వారికీ కూడా మనం అందరం సెల్యూట్ చేయాలి. వారు కూడా వారి ప్రాణాలను లెక్క చేయక 24 గంటలు వారి విధులను నిర్వర్తిస్తున్నారు.
మీడియా ప్రతినిధులు :
ఈ కరోనా మీద పోరాటానికి మీడియా వారు వారి వంతు సహాయం వారు చేస్తున్నారు.ఎప్పటికప్పుడు మనకి వార్తలు అందిస్తూ మనల్ని ఎలెర్ట్ చేస్తూ ఉన్నారు.
పంచాయితీలు ,నగరపాలక ,పురపాలక కార్యాలయాలు :
వీటిలో పనిచేసే పారిశుధ్య కార్మికులు ,ఉద్యోగులు ఇతర సిబ్బంది సైతం మేము ఉన్నాం అంటూ దీని పైన పోరాటం చేయటానికి వారి వంతు సహాయం వారు చేస్తున్నారు.జాగ్రత్తలు :
- మాస్క్ లేకుండా బయటకు రాకూడదు.
- చాల మందికి ఈ విషయం తెలిసిన పట్టించుకోకుండా తిరుగుతున్నారు.
- కొంతమంది మాకేమి కాదులే అని ,కానీ మన వలన మిగతా వారు ఇబ్బంది పడతారు అని తెలియాలి ఒకోసారి మన కుటుంబ సభ్యులు సైతం ఇబ్బందిలో పడతారు.
- అవసరం అనుకుంటెనే బయటకు రావాలి.. అది కూడా చిన్నపిల్లలు మరియు 60 సంవత్సరాలు పైబడిన వారు రాకూడదు.
- హ్యాండ్ వాష్ లు,సానెటిజర్ మరియు మాస్క్ గ్లౌజ్ లు తప్పనిసరి.
- పోలీస్ వారు వైద్య సిబ్బంది మరియు ప్రభుత్వాలు చెప్పే నిబంధనలు అందరం పాటించాలి.
ముగింపు:
అందరం తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారి నుండి తొందరగా బయట పడతాము.. ఎవరు నిర్లక్ష్యం వహించిన బారి మూల్యం చెల్లించుకోవాల్సివస్తుంది.By KKK
0 Comments