Teaser

6/recent/ticker-posts

ఆత్మహత్యాయత్నాలపై వ్యాసం


జీవితం చాల విలువైనది  దాన్ని బలవతంగా తీసుకునే హక్కు  లేదు.


సో ఇప్పటికే అర్థమైవుంటుంది నా  వ్యాసం దేనిమీదో. అదే "ఆత్మహత్యాయత్నం"
ప్రతి నలభై సెకన్లకు ఒకరు ఆత్మహత్య. కానీ ఉన్నది ఒకటే జిందగీ. గెలుపు ఓటములు సర్వసాధారణం.అలాగే జీవితం అంటె  ఆటుపోట్లు చాల సాధారణం. ఓడిపోవడం తప్పు కాదు.. విజయానికి అది ఓ మెట్టు మాత్రమే. కానీ మారుతున్న కాలానికి తగ్గట్లుగా పరుగులు తీయలేక కొందరు, ఆర్థిక, వ్యక్తిగత, మానసిక.. ఇలా ఎన్నెన్నో కారణాలతో తనువు చాలిస్తున్నారు. అయితే బతికి సాధించుకోవాలి, కానీ ఆత్మహత్యతో ఏ ప్రయోజనం లేకపోగా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి జీవితాలను అంధకారంలోకి నెడుతుంది.
ప్రతి ఏటా" సెప్టెంబర్ 10వ తేదీని 2003" నుంచి ‘ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం’గా నిర్వహిస్తున్నారు.డబ్ల్యూహెచ్ఓ తాజా గణాంకాల ప్రకారం ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారి సంఖ్య సగానికి పైగా ఉంది. 15-29 ఏళ్ల మధ్య వారిలో రోడ్డుప్రమాద మరణాల తర్వాత రెండో కారణంగా ఆత్మహత్యలు ఉండటం విచారకరం. బలవన్మరణాలపై పెద్దగా చర్చ జరగడం లేదని భావించి ఐఏఎస్‌పీ, డబ్ల్యూహెచ్ఓలు దశాబ్ధన్నరం నుంచీ ప్రతి ఏడాది ఆత్మహత్యల నివారణ దినాన్ని నిర్వహిస్తోంది. కుటుంబం, స్నేహితులు, ప్రేమ, ఆర్థిక కారణాలతో తనువు చాలిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ టెడ్రోస్ అడనామ్ ఘెబ్రెయేసస్ తెలిపారు. అవగాహన కల్పించి ఆత్మహత్యల వల్ల నష్టాలు, అనంతర పరిణామాలు వివరిస్తే కొద్దిమేర వీటిని నివారించవచ్చు. ఒకరు సూసైడ్ చేసుకుంటే దాని ప్రభావం దాదాపు 135 మందిపై పడుతుందని అమెరికన్లు చేసిన ఓ అధ్యయనంలో గతంలో వెల్లడైంది.

Another Tragic Epidemic: Suicide - Scientific American

ఆ లక్షణాలు కనిపిస్తే ఆత్మహత్య ఆలోచనలున్నట్టే!

రీసెర్చర్ల అధ్యయనం ప్రకారం.. ఎవరైతే తాను ఇక బతకడం వేస్ట్ అని, పదే పదే ఆత్మహత్య గురించి మాట్లాడుతారో, తమకు తామే హాని చేసుకోవడానికి యత్నిస్తారో వారిలో ఆత్మహత్య ఆలోచనలు ఉంటాయి. ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ప్రతి సందర్భంలోనూ చికాకుపడటం, ఇతరులతో మాట్లాడకుండా ఏకాకిగా ఉండాలనుకుంటారు. తాము చేసే ప్రతిపనిలోనూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిద్రలేమితో బాధపడటం. జీవితంలో తనకు కావాల్సింది ఏదీ దక్కలేదని పదేపదే ప్రస్తావించడం లాంటి లక్షణాలు కనిపిస్తే ఆ వ్యక్తులు ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నారని గ్రహించాలి.

21వ స్థానంలో భారత్

ఆత్మహత్యల ర్యాకింగ్స్ పరిశీలిస్తే ప్రపంచ దేశాలలో భారత్ 21వ స్థానంలో ఉంది. డబ్ల్యూహెచ్ఓ 2018 లెక్కల ప్రకారం 16.3 సూసైడ్ రేట్ (ప్రతి లక్ష మందికి)తో భారత్‌లోనూ ఆత్మహత్యలు ఎక్కువేనని తేలింది. డబ్ల్యూహెచ్ఓ 2016 గణాంకాల ప్రకారం.. భారత్‌లో ప్రతి 1,00,000 జనాభాలో పురుషుల్లో ఆత్మహత్యల రేటు 18.5 శాతం ఉండగా, మహిళల రేటు 14.5శాతంగా ఉంది. మద్యపానం, ధూమపానంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత కారణాలతో మగవారిలో ఆత్మహత్య లక్షణాలు ఎక్కువని తేలింది.

ఆత్మహత్యలకు కారణాలు

   1.  ప్రేమ అనుబంధాల వైఫల్యం, ఆత్మీయులను కోల్పోవడం, కుటుంబ కలహాలు,     అవాంఛిత గర్భం
    2. వరకట్న వేధింపులు,
   3. నయంకాని జబ్బులు, అనారోగ్యం,
   4.  తీర్చలేని అప్పులు, ఆస్తినష్టం, పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం, ఉన్నవారికి లేనివారికి మధ్య పెరుగుతున్న అంతరాలు, ఆర్థిక ఇబ్బందులు,
   5.  రాజకీయ అస్థిరత
    మతపరమైన విద్వేషాలు, సైద్ధాంతిక కారణాలు, హీరోలపై మితిమీరిన అభిమానం
    ఉద్యోగాన్ని, గౌరవాన్ని, సామాజిక హోదాను కోల్పోవడం, నిరుద్యోగం
    పురుగు మందుల అందుబాటు
   6. అనువంశిక, జన్యులోపాలు
   7.  కుటుంబంలో ఏవరి అండదండలు లేకపోవడం వారిని సరిగ్గా పట్టించుకోలేకపోవడం
    8. మోసపోవడం మతిస్తిమితం సరిగ్గా లేకపోవటం
    9. మద్యానికి బానిస కావడం
   10. భార్య భర్తల మద్య గొడవలు పడడం ఒకరినొకరు అర్థం చేసుకొకపోవడం

ఆపడం ఎలా..

    1. ఎక్కువ మంది క్షణికావేశంలోనే ఆత్మహత్యలు చేసుకుంటారు. అప్పుడక్కడ వారిని ఎవరైనా ఆపితే ఆ క్షణం గడిచిపోతుంది. వాళ్ళు మళ్ళీ ఆత్మహత్య గురించి ఆలోచించరు.
    2. పని ఒత్తిడి, పరిమితి లేని కోర్కెలు... చిన్న విషయానికే ఆవేశం, మనస్థాపానికి గురవ్వడం, అసూయ వంటి మానసిక రుగ్మతలు తగ్గించుకోవాలి.
    3. బిడ్డల భవిష్యత్తు, జీవితాంతం కష్టసుఖాల్లో కలకాలం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా చేసుకున్న ప్రమాణం, ఆప్యాయత ఆవేశం వీడి గుర్తుతెచ్చుకోవాలి.
    4. సమశ్యలను తల్లిదండ్రులు, మిత్రులు ఆత్మీయులతో పంచుకోవాలి.
    5. పోషించే శక్తిలేనివారు పిల్లల్ని కనకపోవటం మంచిది .                                                                                                                                                                                                                                                             

ముగింపు .

ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసుకునేముందు మీ తల్లిదండ్రులను,మీ భర్త లేదా భార్య పిల్లలను,సోదరి, సోదరులను మరియు స్నేహితులను గుర్తుకుతెచ్చుకోవాలి. దేవుడు ఇచ్చిన గొప్పాజీవితాన్ని ఆస్వాదించే హక్కు మనకు ఉంది. ప్రతి సమస్యకు చావు ఒకటే పరిష్కారం కాదు.  
 

Post a Comment

1 Comments